రజకులకు కేటాయించిన నిధులు తక్షణమే విడుదల చేయాలంటూ అసెంబ్లీని ముట్టడికి యత్నించారు అఖిల భారత రజక సంఘం నాయకులు. తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది.
రజకులకు నిధుల విడుదల చేయాలంటూ అసెంబ్లీ ముట్టడి - నిధుల విడుదల చేయాలంటూ అసెంబ్లీ ముట్టడించిన రజకులు
అఖిల భారత రజక సంఘం నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. రజకులకు కేటాయించిన రూ.250 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వైపునకు దూసుకొచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేసి గాంధీనగర్ ఠాణాకు తరలించారు.
![రజకులకు నిధుల విడుదల చేయాలంటూ అసెంబ్లీ ముట్టడి Assembly attack by rajaka sangam leaders to release funds immediately in hyderabad nampally Assembly attack by rajaka sangam leaders to release funds immediately in hyderabad nampally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11124081-39-11124081-1616492193213.jpg)
రజకులకు నిధుల విడుదల చేయాలంటూ అసెంబ్లీ ముట్టడి
రజకులకు కేటాయించిన రూ.250 కోట్లను వెంటనే విడుదల చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేసి గాంధీనగర్ ఠాణాకు తరలించారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని రజక సంఘాల నేతలు హెచ్చరించారు.
రజకులకు నిధుల విడుదల చేయాలంటూ అసెంబ్లీ ముట్టడి