Assam cm tweet about KCR : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతూనే ఉంది. ‘రాహుల్‌గాంధీయే కాదు నేను కూడా ప్రశ్నిస్తున్నా.. మెరుపు దాడుల (సర్జికల్ స్ట్రయిక్స్) సందర్భంగా ఏం జరిగిందో బయటపెట్టాలి’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంపై హిమంత బిశ్వశర్మ సోమవారం ఉదయం ట్విటర్‌లో స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యల వీడియోను జత చేస్తూ ‘విపక్షం మెరుపు దాడుల గురించి ప్రశ్నిస్తూ.. అమరవీరులను అవమానించేందుకు పూనుకుంది’ అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ గారూ.. ఇదిగో సాక్ష్యం.. సైన్యాన్ని అవమానిస్తే నవభారతం సహించదు: అసోం సీఎం - తెలంగాణ వార్తలు
Assam cm tweet about KCR : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతోంది. కేసీఆర్ వ్యాఖ్యల వీడియోను జత చేస్తూ ‘విపక్షం మెరుపు దాడుల గురించి ప్రశ్నిస్తూ.. అమరవీరులను అవమానించేందుకు పూనుకుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ట్విటర్‌లో స్పందించారు.
అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ట్వీట్
కేసీఆర్, కాంగ్రెస్ నాయకులు గాంధీ కుటుంబానికి తమ విధేయతను ప్రదర్శించడానికి పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘డియర్ కేసీఆర్ గారూ.. మన సైన్యం చేసిన వీరోచిత దాడులకు ఇదిగో సాక్ష్యం’ అంటూ పేర్కొన్నారు. ‘సైన్యాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి మీరెందుకు ప్రయత్నిస్తున్నారు? సైన్యాన్ని అవమానిస్తే నవభారతం సహించదు’’ అని ట్విటర్‌లో కేసీఆర్‌కు జవాబిచ్చారు.