హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 3న జరిగిన కెనరా బ్యాంకు ఏటీఎం చోరీ యత్నాన్ని పోలీసులు ఛేదించారు. బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు... సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులు ఖలీద్ కమల్ అహ్మద్, మహమ్మద్ రియాజ్‌లను ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఓ ద్విచక్ర వాహనం, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.ఆర్. శ్రీనివాస్ తెలిపారు. ఏటీయంల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
చోరీ యత్నాన్ని ఛేదించిన ఆసిఫ్‌నగర్ పోలీసులు - ఆసిఫ్‌నగర్
ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 3న జరిగిన ఏటీఎం చోరీ యత్నాన్ని పోలీసులు ఛేదించారు.
చోరీ యత్నాన్ని ఛేదించిన ఆసిఫ్‌నగర్ పోలీసులు