తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2019, 8:46 PM IST

ETV Bharat / state

మయో క్లినిక్స్​తో ఏఐజీ ఒప్పందం

అమెరికా వైద్య రంగంలో అత్యంత పేరుగాంచిన మయో క్లినిక్స్​తో పనిచేసేందుకు ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వారు ఒప్పందం కుదుర్చుకున్నారు.  గచ్చిబౌలిలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, మయో క్లినిక్ ఎండీ డేవిడ్ హయాస్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

మయో క్లినిక్స్​తో ఏఐజీ ఒప్పందం

రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వారు అమెరికాకు చెందిన మయో క్లినిక్స్​తో ఒప్పందం కుదుర్చుకున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, మయో క్లినిక్ ఎండీ డేవిడ్ హయాస్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. భారతదేశంలోనే మయో క్లినిక్స్​తో కలిసి పనిచేయనున్న మొట్టమొదటి సంస్థ ఏఐజీ కావడం విశేషం. మయో క్లినిక్​ వైద్యులతో లైవ్ వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ... రివ్యూ చేయనున్నారు. ఫలితంగా రోగులకు గతంతో పోలిస్తే మరింత మెరుగైన వైద్యులు సేవలు అందే అవకాశం ఉందని ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.

మయో క్లినిక్స్​తో ఏఐజీ ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details