తెలంగాణ

telangana

By

Published : Oct 29, 2020, 12:42 PM IST

ETV Bharat / state

'క్రీడాకారులను ప్రోత్సహించేందుకే రాష్ట్రంలో స్టేడియాల నిర్మాణం'

చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయాలనే ఉద్దేశంతో తొలిసారిగా ఆన్​లైన్​ ద్వారా పోటీలు నిర్వహిస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏసియన్ ఆన్​లైన్ ఈ-కటా ఛాంపియన్​ షిప్​-2020 ఇంటర్నేషనల్​ కుంగ్​ ఫు టోర్నమెంట్​ బ్రోచర్​ను ఆవిష్కరించారు.

Asian E-kata competition poster
తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే రాష్ట్రంలో స్టేడియాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు దృఢంగా ఉంటారని చెప్పారు.

తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసి, వారిలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆన్​లైన్ ద్వారా క్రీడలు నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తొలి ఏసియన్ ఆన్​లైన్ ఈ-కటా ఛాంపియన్​షిప్​2020 ఇంటర్నేషనల్​ కుంగ్​ ఫు టోర్నమెంట్​ బ్రోచర్​ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం జేఏసీ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు గౌడ్, ఉపాధ్యక్షుడు వేములయ్య గౌడ్, కుంగ్​ ఫు మాస్టర్స్ మురళి, కృష్ణం రాజు, కన్నన్ గౌడ్, దేవేందర్​లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details