కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దుర్మార్గ పాలన సాగుతోందని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఉస్మానియాలో దీక్ష చేస్తున్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పరామర్శించారు. ఆస్పత్రిలో అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం రేపు ఉదయంలోగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు ఆర్టీసీ ఐకాస భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ చెబుతామని చెప్పారు.
రేపు ఆర్టీసీ ఐకాస భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ: కోదండరాం
ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం రేపు ఉదయంలోగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు: కోదండరాం