హైదరాబాద్ సైదాబాద్ మండల రెవెన్యూ కార్యాలయంలో పింఛన్ మంజూరు పత్రాలను తహసీల్దార్ పంపిణీ చేశారు. అర్హులైన కొంత మంది లబ్ధిదారులకు పెరిగిన ఆసరా పింఛన్ ఉత్తర్వు పత్రాలను అందజేశారు. మలక్‌పేట, యాకుత్‌పురా నియోజకవర్గంలో సైదాబాద్ మండల పరిధిలో సుమారు 8,420 మందికి పెరిగిన పింఛన్ మంజూరు అవుతుందని తహసీల్దార్ జ్యోతి వివరించారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు 2016 రూపాయలు, దివ్యాంగులకు 3016 రూపాయల పింఛన్ ఈ నెల నుంచే అందజేస్తున్నట్లు జ్యోతి తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే పింఛన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సైదాబాద్‌లో పెంచిన పింఛన్ పత్రాల జారీ - జారీ
సైదాబాద్ మండల రెవెన్యూ కార్యాలయంలో పెంచిన పింఛన్ మంజూరు పత్రాలను అర్హులకు తహసీల్దార్ పంపిణీ చేశారు.
సైదాబాద్‌లో పెంచిన పింఛన్ పత్రాల జారీ