హైదరాబాద్ బలకపుర్ నాలా కోసం శాశ్వత పరిష్కారం చూపాలని ఎంఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అధికారులకు సూచించారు. వచ్చేది వర్షాకాలం కావడంతో నాలాపై అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో టోలి చౌకి లోని కొన్ని కాలనీలు నీట మునుగుతుండటంతో.. వాటికి శాశ్వత పరిష్కారం చేయాలని సూచించారు. అధికారులు ప్రణాళికాబద్ధంగా నాలను సరి చేస్తామని తెలిపారు. నాలా కు సంబంధించిన మ్యాప్ ను అధికారులు ఎంపీకి చూపించారు. మిల్ట్రీ ఏరియాలోకి వెళ్లి మురికి నాళాలను పర్యవేక్షించాలని అనుకున్నా... మిలటరీ అధికారులు నిరాకరించడంతో జీహెచ్ఎంసీ అధికారులు వెనుతిరిగారు.