Asaduddin Owaisi's relative commits suicide with firing a gun: కర్మాన్ ఘాట్ లోని ఒవైసీ ఆసుపత్రి, పరిశోధన విభాగంలో ఆర్థోపెడిక్ సర్జన్ గా మజార్ ఉద్దీన్ ఆలీ ఖాన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్ సహ విద్యార్థి. 2020లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రెండో కుమార్తెకు మజార్ కుమారుడు డార్టర్ అభిల్ అలీ ఖాన్‌తో వివాహం జరిగింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని హనుమాన్ స్ట్రీట్ లోని నివాసంలో డాక్టర్ మజార్ దంపతులు నివాసం ఉంటున్నారు.
ఇంటి కింది పోర్షన్ లో భార్య అఫియా ఖాన్...మొదటి అంతస్తులో మజార్ ఉంటున్నారు. అయితే 2 నెలలుగా ఆస్తి వివాదాలకు సంబంధించి ఆ ఇంటి నుంచి కేకలు, అరువులు వినిపిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి తుపాకీ పేలిన శబ్దం విన్నామని చెబుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడి రక్తపు మడుగులో ఉన్న మజార్ ను కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మజార్ చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. విషయం తెలుసుకున్న అక్బరుద్దీన్ ఒవైసీ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Asaduddin Owaisi's relative commits suicide: ఆదివారం రాత్రి మజార్ కు నిద్రపట్టకపోవడంతో అతనికి 15 ఏళ్లుగా మసాజ్ చేస్తున్న వ్యక్తిని ఇంటికి పిలిచారు. మసాజ్ చేయించుకున్న తర్వాత కూడా నిద్రపట్టకపోవటంతో రాత్రంతా ఇంట్లోనే నడుచుకుంటూ తిరిగారు. సోమవారం ఉదయం భార్యతో కలిసి బయటకు వెళ్లొచ్చారు. అనంతరం తన గదికి వెళ్ళిన మజార్ తలుపులు వేసుకున్నాడు. ఉదయం 6 గంటలకు ఆయన గదికి పనిమనిషి వెళ్లింది.
తాను నిద్రపోతానని 10 గంటలకు లేపమంటూ అమెను మజార్ వెనక్కి పంపారు. 11 గంటలవుతున్నా ఆయన గదిలో ఎటువంటి అలికిడి లేవకపోవటంతో పనిమనిషి కిటికీలో నుంచి గదిలోకి చూసింది. అనుమానం వచ్చి భార్య ఆఫియాకు సమాచారం ఇచ్చింది. ఆమె పరిశీలించి రెండో కుమారుడికి ఫోన్ చేసి పిలిపించింది. గది కిటికీ ద్వారా కుమారుడిని లోపలకు పంపారు.