ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వ నిజామియా ఏరియా ఆసుపత్రిలో శనివారం కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షా ఫలితాలు నెగెటివ్ వచ్చినట్లు అసదుద్దీన్ ట్విటర్లో పేర్కొన్నారు. ఆ ప్రాంతంలోని ప్రజలు టెస్టులు చేయించుకునేలా వారిలో అవగాహన పెంచేందుకు తాను యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నట్లు అసదుద్దీన్ వివరించారు. పాతబస్తీలో 30కి పైగా ఆంటీజెన్ పరీక్షాకేంద్రాలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి వెనకంజ వేయకుండా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
కొవిడ్ పరీక్ష చేయించుకున్న ఓవైసీ.. రిపోర్టులో ఏముందంటే..! - asaduddin owaisi undergone covid tests
హైదరాబాద్ నిజామియా ఏరియా ఆసుపత్రిలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శనివారం కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్ష ఫలితాల్లో నెగిటివ్ వచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు.
నిజామియా ఆసుపత్రిలో అసదుద్దీన్ ఓవైసీ కొవిడ్ పరీక్షలు
అనంతరం నిజామియా ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సౌకర్యాలను ఎంపీ పరిశీలించారు. కొవిడ్ ప్రభావం రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన కోరారు.
Last Updated : Jul 11, 2020, 1:46 PM IST