తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈశాన్య దిల్లీని సైన్యానికి అప్పగించాలి: అసద్ - asaduddin owaisi on delhi issue in twitter

ఈశాన్య దిల్లీలో పోలీసులు తమ కర్తవ్యాన్ని మరచి... దాడులకు పాల్పడుతున్నారని మజ్లిస్​ అధినేత,​ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. పరిస్థితి మరింత చేజారకముందే ఆ ప్రాంతాన్ని సైన్యానికి అప్పగించాలని అసద్ కోరారు.

asaduddin owaisi tweet on delhi issue
ఈశాన్య దిల్లీని సైన్యానికి అప్పగించాలి: అసద్

By

Published : Feb 26, 2020, 4:46 AM IST

Updated : Feb 26, 2020, 7:54 AM IST

ఈశాన్య దిల్లీలో పరిస్థితి చేజారుతోందని మజ్లిస్​ అధినేత, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. శాంతిని పునరిద్ధరించాలని ప్రధాని మోదీ కోరుకున్నట్లయితే... ఆ ప్రాంతాన్ని ఆర్మీకి అప్పజెప్పాలని అసద్ కోరారు.

పోలీసులు తమ అధికారాన్ని మరచిపోయి.. గుంపులతో కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు. దిల్లీ ప్రజల ప్రాణాల్ని కాపాడాలని మోదీ భావిస్తే.. శాంతి, భద్రతలను సైన్యానికి అప్పగించాలన్నారు.

ఇదీ చూడండి:-అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్​లో ఓ గ్రామం!

Last Updated : Feb 26, 2020, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details