సీఏఏ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎం సభ నిర్వహించనుంది. హైదరాబాద్లోని కిల్వత్ మైదానంలో ఎంఐఎం ఆధ్యర్యంలో నేడు ఓ బహిరంగ సభ జరగనుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఈ సభ కోసం హైకోర్టు అనుమతి తీసుకున్నామని వెల్లడించారు.
మరికొద్దిసేపట్లో పాతబస్తీలో ఎంఐఎం బహిరంగ సభ - ASADUDDIN OWAISI
పౌరసత్వ సవరణ చట్టంను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు హైదరాబాద్లో ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించనుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9.45 గంటల వరకు సభ జరగనుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
పాతబస్తీలోని కిల్వత్ మైదానంలో ఎంఐఎం బహిరంగ సభ
ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 9.45 గంటల వరకు ఈ కార్యక్రమానికి అనుమతి లభించిందని తెలిపారు. హైదరాబాద్లో ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఆయన వెల్లడించారు.
ఇవీ చూడండి: విజయం తెరాస ఏకపక్ష విజయం
TAGGED:
ASADUDDIN OWAISI