తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశాన్ని బలహీన పరిచేలా చట్టాలు చేస్తున్నారు: ఒవైసీ - Asaduddin Owaisi

ప్రధాని మోదీ చెప్పినట్లు ఆయన ప్రజలకు ప్రధాన సేవకుడు కాదని... ఆయనో నియంతని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ప్రధాని మోదీ డిగ్రీ పత్రాలను చూపిస్తే మేము జనన ధ్రువీకరణ పత్రాలు చూపిస్తామని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్ వ్యతిరేక సభలో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.

mim
దేశాన్ని బలహీన పరిచేలా చట్టాలు చేస్తున్నారు: ఓవైసీ

By

Published : Feb 19, 2020, 5:03 AM IST

Updated : Feb 19, 2020, 7:15 AM IST

దేశాన్ని బలహీన పరిచేలా చట్టాలు చేస్తున్నారు: ఓవైసీ

దేశాన్ని బలహీన పరిచేలా భాజపా ప్రభుత్వం చట్టాలు చేస్తోందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. దేశంలో తొలిసారిగా మతం పేరు మీద చట్టం చేసిన ప్రభుత్వం ఇదేనని పేర్కొన్నారు. ముస్లింలకు అన్యాయం చేయటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా కేంద్రం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

సీఏఏ విషయంలో మోదీకి భయపడవద్దని తెదేపా అధినేత చంద్రబాబును ఒవైసీ కోరారు. చంద్రబాబు ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి నిర్భయంగా మోదీని ఎదురించవచ్చని పేర్కొన్నారు. ఇది కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదని... భారతీయులందరికి సంబంధించినదని పేర్కొన్నారు. ఇది ఏ ఒక్క మతానికో సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు.

ఈ చట్టాలకు వ్యతిరేకంగా వారానికోసారి బహిరంగ సభలు పెట్టాలని ఒవైసీ కోరారు. అవసరమైతే జైల్ భరో నిర్వహించాలని నినదించారు. 2015 ఆరోగ్య సర్వే ప్రకారం చాలా మందికి జనన ధ్రువీకరణ పత్రాలు లేవన్నారు. 40 శాతం ముస్లింలు, 40 శాతం వెనుకబడిన వర్గాల వారికి జనన ధ్రువీకరణ పత్రాలు లేవని వివరించారు.

జామియా మిలియా లైబ్రరీలో విద్యార్థులు చదువుకుంటుంటే పోలీసులు వారిపై దాడి చేశారని చెప్పారు. పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థికి కన్ను పోయిందని వివరించారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన 124 జీవో తప్పు అని అసదుద్దీన్ చెప్పారు.

ఇదీ చదవండి:'సీఏఏ, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా వైకాపా బిల్లు పెట్టాలి'

Last Updated : Feb 19, 2020, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details