Hyderabad Pub Case: హైదరాబాద్ బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో యజమాని మినహా ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. కేసు విషయమై ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. కొకైన్ దొరికినప్పటికీ ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ధనవంతుల పిల్లల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా విడుదల చేశారని అసద్ ఆరోపించారు. చట్టం అందరికీ సమానమేనన్న ఆయన... పేదలు, ధనవంతులందరికీ చట్టం సమానంగా ఉండాలని హితవు పలికారు. మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలిస్ కమిషనర్లను ట్యాగ్ చేశారు.
''పుడింగ్ పబ్ కేసులో యజమాని మినహా ఎవరినీ అరెస్టు చేయలేదు. ధనవంతుల పిల్లల్లో ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. కొకైన్ దొరికినా ఎవరినీ అరెస్టు చేయకపోవడం దురదృష్టకరం. పేదలు, ధనవంతులకు చట్టం సమానంగా వర్తించాలి.''