CM KCR opposed UCC bill : యూనిఫాం సివిల్ కోడ్ పేరుతో ప్రజలను విభజించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకొస్తున్న యూసీసీ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. దీని వల్ల అన్ని మతాల వారిలో అయోమయం ఉందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో అసదుద్దీన్ ఓవైసీ, ముస్లీం మతపెద్దలతో కేసీఆర్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా యూసీసీని వ్యతిరేకించాలని ముస్లీం మతపెద్దలు వినతి పత్రం ఇచ్చారు. దీనికి ఆయన సానుకూలంగా హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్.. యూసీసీతో ప్రత్యేక సంస్కృతి కలిగిన అన్ని జాతులు, మతాలకు ఇబ్బందని స్పష్టం చేశారు. భారత్.. భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఆదర్శంగా నిలిచిన భారతీయుల ఐక్యతను చీల్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలను నిర్ద్వందంగా తిరస్కరిస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
- ఉమ్మడి పౌరస్మృతితో లాభమా నష్టమా? టార్గెట్ వారేనా? గిరిజనుల మాటేంటి?
- saduddin Owaisi: "మోదీ, అమిత్ షాలకు ముస్లింలు అంటే విద్వేషం ఎందుకు?"
Asaduddin Owais meet with CM KCR : భేటీ అనంతరం బయటకు వచ్చిన అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న యూసీసీ బిల్లు విషయమై కేసీఆర్‌తో చర్చించామని పేర్కొన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. యూసీసీ పేరిట లౌకిక వాదాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. కేవలం ఇది ముస్లింల అంశం కాదని.. క్రైస్తవులు, గిరిజనులు, హిందువులకు కూడా మంచిది కాదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిసున్నారని మండిపడ్డారు.