తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రశాంతత నెలకొంది: అసదుద్దీన్ ఓవైసీ

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం చేసిన ప్రాంతాల్లో భాజపా అభ్యర్థులు ఓటమి పాలయ్యారని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆరున్నరేళ్లుగా ప్రశాంతత నెలకొందని వెల్లడించారు.

asaduddin-owaisi-comments-on-bjp
ఆరున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రశాంతత నెలకొంది: అసదుద్దీన్ ఓవైసీ

By

Published : Mar 2, 2021, 7:55 PM IST

రాష్ట్రంలో ఆరున్నరేళ్లుగా ప్రశాంతత నెలకొందని... శాంతిభద్రతలు బాగా ఉన్నాయని... ఈ క్రెడిట్ ముఖ్యమంత్రి కేసీఆర్​కు, ఆయన యంత్రాంగానికే దక్కుతుందని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ - ఏఐఎంఐఎం పార్టీ 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ దారుస్సలాంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం చేసిన ప్రాంతాల్లో భాజపా అభ్యర్థులు ఓటమి పాలయ్యారని అసదుద్దీన్ పేర్కొన్నారు. మజ్లిస్ మాత్రం గుజరాత్​లోనూ పాగా వేసిందని వెల్లడించారు. పశ్చిమబంగల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ తమ సత్తా చాటుతామని ఓవైసీ తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మజ్లిస్ పూర్తి మద్ధతు ఉంటుందన్నారు. కేంద్రం వ్యవసాయ బిల్లులను వెనక్కు తీసుకోవాల్సిందేనన్నారు. మజ్లిస్ పార్టీ ఎప్పటికీ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని... ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద వర్గాల అభ్యున్నతి కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఐటీఐఆర్ ప్రాజెక్టుపై సీఎంకు లేఖ రాసిన బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details