2023లో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల బరిలో మజ్లిస్ పార్టీ దిగనుంది. హైదరాబాద్ దారుస్సలాంలో గుల్బర్గా నేతలతో సమావేశమైన మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటక శాసనసభ ఎన్నికల బరిలో మజ్లిస్: అసదుద్దీన్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయనుంది. 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.
కర్ణాటక శాసనసభ ఎన్నికల బరిలో మజ్లిస్: అసదుద్దీన్
ఈ సందర్భంగా గుల్బర్గా నార్త్ నుంచి మజ్లిస్ అభ్యర్థిగా ఇలియాస్ భగవన్ సేట్ పేరును అసద్ ప్రకటించారు. నేతలు, ప్రజలు ఈ నిర్ణయాన్ని గౌరవించి, మజ్లిస్ అభ్యర్థిని గెలిపించాలని విన్నవించారు. కర్ణాటక శాసనసభలో తమ వాణిని వినిపించాలని కోరారు.
ఇదీ చూడండి:హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం