హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్‌పై ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. అటువంటి వ్యాఖ్యలు సరికాదంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దారుస్సలాంలో చాలా స్థలం ఉండటం వల్ల మజ్లీస్‌కు అనుమతి దొరికిందని ఆయన పేర్కొన్నారు.
ఉత్తమ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన అసదుద్దీన్ - పోలీస్ కమిషనర్ అంజనీకుమార్
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు.
![ఉత్తమ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన అసదుద్దీన్ asaduddim owaisi tweet on uttam reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5559643-657-5559643-1577870842466.jpg)
ఉత్తమ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన అసదుద్దీన్
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ... నిజామాబాద్‌లో తాము నిర్వహించిన సభకు ఆహ్వానిస్తే రాలేదని వ్యాఖ్యానించారు. జనవరి 4 లేదా 5వ తేదీన ర్యాలీకి అనుమతివ్వాలని... డిసెంబర్ 20వ తేదీనే సీపీకి దరఖాస్తు చేసినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: జైల్లో ఉన్న అధికారికి పరామర్శ