ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దేశాన్ని పాలించడానికి కావాల్సిన అన్ని అర్హతలు, లక్షణాలు ఉన్నాయని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. దేశంలో మోదీ హవా పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. తెలంగాణలో 16 స్థానాలు తెరాస,1 ఎంఐఎం గెలుచుకోవటం ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ... వైసీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు.
'ప్రధాని అయ్యందుకు కేసీఆర్ అర్హుడే' - asad owaisi pracharam
ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రజలతో మమేకమవుతూ... నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎంపీగా నాలుగోసారి విజయం సాధించేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ.
ఇంటింటి ప్రచారం
TAGGED:
asad owaisi pracharam