తెలంగాణ

telangana

ETV Bharat / state

'సచివాలయ నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వండి'

సీఎం ఆదేశాల మేరకు.. నూతన సచివాలయ నిర్మాణ పనులను మంత్రి వేముల పరిశీలించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన గడువుకు అనుగుణంగా గుత్తేదారు, ఆర్ అండ్ బీ అధికారులు.. సమన్వయంతో పనిచేసి త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం అంతస్థుల వారీగా సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

new secretariat
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

By

Published : Apr 8, 2021, 10:53 PM IST

నూతన సచివాలయ నిర్మాణాన్ని నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు.. వర్క్ చార్ట్ ప్రకారం పనుల పురోగతని ఆయన పరిశీలించారు. నిర్మాణంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.

అంతస్థుల వారీగా.. ప్రధాన ద్వారాలు, కిటికీల నమూనాలను మంత్రి ఖరారు చేశారు. పనుల పూర్తికి సీఎం ఇచ్చిన గడువుకు అనుగుణంగా గుత్తేదారు, ఆర్ అండ్ బీ అధికారులు.. సమన్వయంతో పనిచేసి త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆదర్శ కట్టడంగా నిలువనున్న కొత్త సచివాలయ నిర్మాణంలో.. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చారిత్రక నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలని కోరారు. అంతస్థుల వారీగా సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రజాసేవకు అవకాశంగా భావించాలి: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details