వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఏర్పాటైంది. ముఖ్యమంత్రి ఛైర్మన్గా, అటవీ శాఖ మంత్రి వైస్ ఛైర్మన్గా ఉండే ఈ మండలిలో సభ్యులను నియమించారు. శాసనసభ్యుల కోటాలో సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులను సభ్యులుగా ఉంటారు.
శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు సభ్యులుగా..
ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎస్టీ ప్రతినిధి బానోతు రవి, ఎన్జీవోల ప్రతినిధులుగా వరల్డ్ వైడ్ ఫండ్ అనిల్ కుమార్, దక్కన్ బర్డ్స్ మూర్తి, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ అవినాష్ విశ్వనాథన్లను కూడా సభ్యులుగా నియమించారు. శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు, సంబంధిత శాఖల అధికారులను కూడా వన్యప్రాణి మండలి సభ్యులుగా ఉంటారు. వీరంతా మూడేళ్ల పాటు సభ్యులుగా కొనసాగుతారు. ఈ మేరకు అటవీ, పర్యావరణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.