ArunSagar Awards: సాహితీ, పాత్రికేయ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే అరుణ్‌సాగర్ విశిష్ట పురస్కారాలకు ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ప్రముఖ కవి ప్రసాదమూర్తిలు ఎంపికయ్యారు. ప్రసాదమూర్తికి విశిష్ట సాహితీ పురస్కారాన్ని, నాగేశ్వరరావుకు విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని జనవరి 2న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అందజేస్తామని అరుణ్‌సాగర్ ట్రస్టు సోమవారం ప్రకటించింది.
ఎం.నాగేశ్వరరావు, ప్రసాదమూర్తిలకు అరుణ్‌సాగర్ విశిష్ట పురస్కారాలు - ఈనాడు ఎడిటర్
ArunSagar Awards: నిత్యం ఉషోదయానికి ముందే ప్రపంచంలోని విశేషాలన్నింటితో పాఠకులను పలకరించే తెలుగు వారి హృదయ స్పందన "ఈనాడు'' పత్రిక ఎడిటర్ ఎం. నాగేశ్వరరావుకు మరో గౌరవం దక్కింది. సాహితీ, పాత్రికేయ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే అరుణ్‌సాగర్ విశిష్ట పురస్కారాలకు నాగేశ్వరరావు ఎంపికయ్యారు.
అరుణ్‌సాగర్ విశిష్ట పురస్కారాలు
ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, కవి శివారెడ్డి పాల్గొంటున్నట్లు ట్రస్టు వెల్లడించింది.
ఇదీ చూడండి:Rythu Bandhu Funds : రైతులకు శుభవార్త... నేటి నుంచి ఖాతాల్లోకి పెట్టుబడి సాయం
Last Updated : Dec 28, 2021, 1:39 PM IST