తెలంగాణ

telangana

దేశవ్యాప్తంగా ఉన్న కళాకారుల చిత్ర కళా ప్రదర్శన

భారతీయ చిత్రకళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొరావడమే లక్ష్యంగా హైదరాబాద్​లో జాతీయ స్థాయి చిత్ర కళా ప్రదర్శన ఏర్పటైంది. దేశవ్యాప్తంగా ఉన్న 34 మంది ప్రముఖ చిత్రకారుల చిత్రాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయని నిర్వహకులు వెల్లడించారు.

By

Published : Nov 23, 2019, 11:34 PM IST

Published : Nov 23, 2019, 11:34 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న కళాకారుల చిత్ర కళా ప్రదర్శన

కళా నిర్వహణ, జాయ్స్‌ లైఫ్‌స్టైల్‌ సంయుక్త ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ జాయ్స్‌ ఆర్ట్‌ గ్యాలరీని తెజస అధ్యక్షులు ప్రొ.కొదండరాం, భాజపా నేత రామచంద్రరావు ప్రారంభించారు. భాగ్యనగరం చిత్రకళా కేంద్రంగా మారుతోందని, ప్రపంచ స్థాయిలో మన చిత్రకళకు గుర్తింపు తెచ్చేందుకు జాతీయ స్థాయిలో ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని కొదండరాం అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న చిత్రకారులను ఒక వేదికపై తీసుకొచ్చి నగరంలో ప్రదర్శన ఏర్పాటు చేయడం సంతోషకరమని భాజపా నేత రామచంద్రరావు తెలిపారు.

జనవరి 23 వరకు జరిగే ఈ ప్రదర్శనలో దేశ వ్యాప్తంగా ఉన్న 34 మంది ప్రముఖ చిత్రకారుల చిత్రాలు ఇందులో కొలువుదీరాయని నిర్వహకులు వెల్లడించారు. గ్రామీణ జీవన విధానం, నాటి, నేటి ప్రజల స్థితిగతులు, హైటెక్‌ యుగంతో మానిషి ఏవిధంగా మారిపోయాడు, ప్రకృతి సొయాగాలు ఇలాంటి ఎన్నో అద్భతమైన చిత్రాలు చిత్రకళాభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ చిత్రకారులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న కళాకారుల చిత్ర కళా ప్రదర్శన

ఇదీ చూడండి : యూట్యూబ్ చూసి దొంగతనాలు!

ABOUT THE AUTHOR

...view details