తెలంగాణ

telangana

ETV Bharat / state

కృత్రిమ మేధకు జాతీయ వేదిక - latest news of artificial intelligence stand ups

సామాజిక భద్రతే ధ్యేయంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయంగా మేధో సంపత్తి కలిగిన వ్యక్తులను కేంద్ర ఐటీ శాఖ ఆహ్వానం పలుకుతోంది. రూ.100 కోట్లు ప్రాథమిక పెట్టుబడిగా పెట్టి గోప్యత దెబ్బతినకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఏఐ, ఎంఎల్‌ శిక్షణ, పరిశోధనలకు అవకాశం కల్పింస్తూ కేంద్ర ఐటీ శాఖకు ఉన్నత స్థాయి కమిటీ నివేదికను విడుదల చేసింది.

artificial-intelligence-standup-invited-by-national-it-department
కృత్రిమ మేధకు జాతీయ వేదిక

By

Published : Dec 11, 2019, 12:20 PM IST

ప్రజలకు ఉపయోగపడే సమాచారం, సమస్యలకు పరిష్కారాలు, ఉత్తమ ఆవిష్కరణలు, పరిశోధనల్ని ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ జాతీయ కృత్రిమ మేధ వనరుల వేదిక (ఎన్‌ఏఐఆర్‌పీ)ను ఏర్పాటు చేయాలని కృత్రిమ మేధపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సిఫార్సు చేసింది. ప్రభుత్వ విభాగాల వద్ద అందుబాటులోని విలువైన సమాచారాన్ని భద్రత, గోప్యత పాటిస్తూ అందుబాటులోకి తెస్తే వివిధ రంగాల్లోని సమస్యలకు సత్వర పరిష్కారం కనుగొనేందుకు వీలవుతుందని పేర్కొంది. ఈ వేదిక ద్వారా సామాజిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయవచ్చంది.

గోప్యతే ప్రధాన లక్ష్యం:

కృత్రిమ మేధ పరిశోధనలు, ఆవిష్కరణల్లో అంతర్జాతీయంగా మేధో సంపత్తి కలిగిన వ్యక్తులను ఆహ్వానించి, చేయూతనిచ్చేందుకు వీలవుతుందని కమిటీ వివరించింది. ప్రాథమికంగా రూ.100 కోట్ల బడ్జెట్‌తో మూడేళ్ల పాటు అవసరమైన నిధులను సమకూర్చాలని ఐటీ మంత్రిత్వశాఖకు సూచించింది. గోప్యత దెబ్బతినకుండా కృత్రిమ మేధ సమాచారాన్ని బదిలీ చేసుకునేందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలంది. ప్రభుత్వం, పరిశోధన సంస్థలు, విద్యారంగ విభాగాలు, పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామికవేత్తలను సమన్వయం చేయాలని తెలిపింది. ఈ వేదికతో స్టార్టప్‌లకు అవకాశాలు మెరుగవుతాయంది. ఈ మేరకు కృత్రిమ మేధ వేదికలు, సమాచారం పేరిట కేంద్ర ఐటీశాఖ ముసాయిదా నివేదిక విడుదల చేసింది. కేంద్రం వద్ద అందుబాటులోని సమాచారంతో పటిష్ఠం చేయాలంది. ఈ వేదికను కేంద్ర ఐటీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ కేంద్రం(ఎన్‌ఐసీ), పరిశ్రమలకు భాగస్వామ్యం కల్పించాలని సూచించింది.
* నాణ్యమైన సమాచారం అందుబాటులో పెట్టేందుకు వీలుగా లోపాలను సవరించాలి.
* ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల నుంచి సమీకరించిన సమాచారాన్ని నిర్వహించి, పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేక సమాచార కమిటీలు నియమించాలి.
* భద్రత, గోప్యత అంశాల్లో విలువలు పాటించేలా ప్రత్యేక కమిటీ నియమించడంతో పాటు ప్రజలు సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా వ్యక్తిగత యూజర్‌ను అందుబాటులోకి తేవాలి.
* కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా జాతీయ వేదిక క్లబ్‌ను ఏర్పాటు చేయాలి. దీనిద్వారా నిపుణులు ఔత్సాహికులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు వీలవుతుంది.
* జాతీయ సూపర్‌ కంప్యూటింగ్‌ కార్యక్రమం కింద కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.

ఇదీ చూడండి: షాద్​నగర్ కేసులో కీలకమలుపు... 'అస్థీకరణ'తోనే అసలు నిజం!

ABOUT THE AUTHOR

...view details