మారుతున్న సాంకేతికత పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి నుంచే కేంద్ర మాధ్యమిక మండలి (సీబీఎస్ఈ) కృత్రిమ మేధను ఐచ్ఛిక సబ్జెక్టుగా అమలు చేస్తోంది. యోగా, శిశు విద్య అంశాలను కూడా ఐచ్ఛికాలుగా ప్రవేశపెట్టాలని గత మార్చిలో బోర్డు నిర్ణయించింది. తొమ్మిదో తరగతిలో ఎంచుకున్న ఐచ్ఛికాన్నే పదో తరగతిలోనూ ఎంచుకోవాల్సి ఉంటుంది. తప్పని సరి సబ్జెక్టులు ఐదు ఉండగా... ఆరో సబ్జెక్టుగా ఒక ఐచ్ఛిక సబ్జెక్టును తీసుకుంటారు. గణితం అంటే భయపడేవారికి ఊరటనిస్తూ ఈ విద్యా సంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్షల్లో రెండు రకాల గణితం ప్రశ్నాపత్రాలు రూపొందించనున్నారు.
తొమ్మిదో తరగతి నుంచే కృత్రిమ మేధ - యోగా,శిశు విద్య
సీబీఎస్ఈలో గణితశాస్త్రాన్ని ఆప్షనల్ సబ్జెక్టుగా ఈ ఏడాది నుంచే చేర్చనున్నారు. పదో తరగతి గణితంలోనూ రెండు రకాల ప్రశ్నా పత్రాలు అందుబాటులో ఉండనున్నాయి. పదోతరగతి తర్వాత గణితం లేని సబ్జెక్టు చదువుకోవాలనుకునే వారికి ఇదో శుభవార్త అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు కొందరు విద్యార్థులు.
![తొమ్మిదో తరగతి నుంచే కృత్రిమ మేధ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4242970-1106-4242970-1566791952854.jpg)
తొమ్మిదో తరగతి నుంచే కృత్రిమ మేధ
తొమ్మిదో తరగతి నుంచే కృత్రిమ మేధ
పదో తరగతి తర్వాత గణితం లేని సబ్జెక్ట్ చదువుకోవాలని అనుకున్నవారు సులభంగా ఉండే ప్రశ్నా పత్రాన్ని ఎంచుకోవచ్చు. పదో తరగతి గణితం సిలబస్ అందరికీ ఒక్కటే. తరగతి గదిలో ఒకేలా బోధిస్తారు. విద్యార్థులు ఎంచుకున్న దాన్ని బట్టి ప్రశ్న పత్రాన్ని ఇస్తారు.
ఇవీ చూడండి : వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
Last Updated : Aug 26, 2019, 5:23 PM IST