కరోనా కాలంలో ప్రైవేటు ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలను గమనించిన నరహరి అనే చిత్రకారుడు తనదైన శైలిలో 6/12 సైజులో ఓ కాటన్ క్లాత్ పైన పదిహేను రోజుల పాటు శ్రమించి కళ్లకు కట్టినట్టుగా వారి కష్టాలను చిత్రీకరించారు. గత పదిహేను నెలలుగా ఉపాధ్యాయులకు జీతాలు రాకపోవడం వల్ల పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా కూలీ పనికి వెళ్లాల్సి పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు.
ఔరా... ప్రైవేటు టీచర్ల కష్టాలపై పెయింటింగ్ - art on private teachers problems
కరోనా కాలంలో ప్రైవేటు ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ చిత్రకారుడు వారి కష్టాలపై క్లాత్‌పై పెయింటింగ్ వేశారు. కళ్లకు కట్టినట్లు వారి కష్టాలను చిత్రీకరించారు.
art on private teachers problems
విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దే గురువులకు ఇలాంటి దుస్థితి రాకూడదు అంటే వారి తల్లిదండ్రులు సరైన సమయంలో స్కూళ్లకు ఫీజులు చెల్లించడం ద్వారా ఉపాధ్యాయులకు జీతాలు అందుతాయని పేర్కొన్నారు. ఒక్కసారి విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాల్సిందిగా ఆయన కోరారు.
ఇదీ చూడండి:కొవిడ్ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని