తెలంగాణ

telangana

ETV Bharat / state

జ్ఞానం... ధ్యానం.. గానంతోనే మనిషికి సంతోషం! - సత్సంగ్

జ్ఞానం...విజ్ఞానం...సంస్కృతి వంటి వాటిని వ్యసనాలుగా మార్చుకున్నప్పుడే... మిగిలిన చెడు వ్యసనాలకు మనిషి దూరం కాగలడని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు...ప్రపంచ శాంతి దూత శ్రీశ్రీ రవిశంకర్ శాంతి సందేశం అందించారు. చిత్తూరు జిల్లా పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో సత్సంగ్ కార్యక్రమం నిర్వహించిన ఆయన... విద్యార్థులను ఉత్తేజ పరిచేలా ప్రసంగించారు.

జ్ఞానం...ధ్యానం..గానంతోనే మనిషికి సంతోషం!

By

Published : Sep 15, 2019, 12:10 AM IST

జీవించే కళను నేర్చుకున్నప్పుడే మనిషి జీవితం సార్థకం అవుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్ అన్నారు. పుత్తూరులోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించిన శాంతి సత్సంగ్​కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామీ...కళాశాల ఛైర్మన్ అశోక రాజు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

విజ్ఞాన సముపార్జనే ముఖ్యం

సత్సంగ్​ను ప్రారంభించిన రవిశంకర్ గురూజీ...సుమారు గంటపాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి యువ శక్తే రేపటి దేశ భవిష్యత్తు అన్న రవి శంకర్.... యువతరం తమకి ఒక లక్ష్యం...దేశం కోసం ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని కృషి చేయాలన్నారు. తమదైన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూనే ... దేశాల సరిహద్దులను సైతం చేరిపేసెలా ప్రేమను పంచాలన్నారు. దేవుడు ఒక్కడే అయినా రూపాలు అనేకమని సందేశమిచ్చారు. విజ్ఞాన సముపార్జన ధ్యేయంగా కృషి చేయాలని సూచించారు. చిన్న వయసులోనే పిల్లలని విపరీతంగా ప్రభావితం చేస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులను చిన్నారులకు దూరంగా ఉంచాలి అని సూచించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రసంగం అనంతరం పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని నృత్య రీతులను కళ్లకు కడుతూ ప్రదర్శించిన నృత్య రూపకం...సభికులను పరవశింప చేసింది. పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి మన్ననలను అందుకుంది. ముఖ్యంగా రవి శంకర్ గురూజీ ప్రసంగానికి ప్రజలు...విద్యార్థులు తమ అభివాదాలు...కేరింతలతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

జ్ఞానం...ధ్యానం..గానంతోనే మనిషికి సంతోషం!

ఇదీ చదవండి: చంద్రయాన్​ కోసం కృష్ణుడికి 56 వంటకాలతో నైవేద్యం

ABOUT THE AUTHOR

...view details