తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో కరుడుగట్టిన దొంగ అరెస్టు - హైదరాాబాద్​ గోపాలపురం పోలీసులు

రాష్ట్రంలోని పలుచోట్ల ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగను హైదరాబాద్​ దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.17లక్షల విలువ చేసే 413గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

arrested-thief-arrested-in-hyderabad
హైదరాబాద్​లో కరుడుగట్టిన దొంగ అరెస్టు

By

Published : Mar 4, 2020, 12:03 PM IST

మల్కాజిగిరి మౌలాలీకి చెందిన సద్దాం అలీ వృత్తిరీత్యా వెల్డింగ్ పని చేస్తుంటాడు. చోరీలకు అలవాడు పడిన సద్దాం తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీ చేయడంలో సిద్ధహస్తుడు. ఇతనిపై 51కి పైగా కేసులున్నాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్​తో పాటు.. వరంగల్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

2018లో గోపాలపురం పోలీసులు పీడీ చట్టం కింద ఏడాది పాటు జైలుకు పంపించినట్లు హైదరాబాద్ సీపీ వెల్లడించారు. నెల క్రితం జైలు నుంచి బయటికి వచ్చిన సద్దాం నగరంలోని చిలకలగూడ, నల్లకుంట పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేశాడని తెలిపారు. నిఘా పెట్టిన దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు సద్దాంను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్​లో కరుడుగట్టిన దొంగ అరెస్టు

ఇవీ చూడండి: 'అప్రమత్తంగానే ఉన్నాం.. ఆందోళన చెందకండి'

ABOUT THE AUTHOR

...view details