హైదరాబాద్ జంటనగరాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరు నిందితులను పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 5.60 లక్షల నగదు, 14.4 తులాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హబీబ్‌నగర్ మంగర్బస్తీకి చెందిన మహ్మద్ రిజ్వాన్ అలియాస్ కైలాశ్, ఆసిఫ్‌నగర్ హరిదర్గాకు చెందిన మహ్మద్ రిజ్వాన్ అలియాస్ వీరూ అని సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిందితులిద్దరూ ఇదివరకే పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్టు - హైదరాబాద్
జంటనగరాల్లో గొలుసు దొందతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్టు