లాక్డౌన్ పరిస్థితుల కారణంగా తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పరీక్షలు, ప్రాక్టికల్స్ నిర్వహణ, మూల్యాంకనం, అసైన్మెంట్లు, ప్రాజెక్టులు ఏ విధంగా చేపట్టాలనే అంశాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. దాదాపు అన్ని విభాగాలు ఆన్లైన్ పాఠాలను బోధిస్తున్నాయని ఉస్మానియా యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
ఓయూలో సెంటర్ ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ - లాక్డౌన్ సమయంలో బోధనకు ఓయూ ప్రత్యేక కమిటీ ఏర్పాటు
లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన విధంగా విద్యాబోధన జరిగేలా ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాట్లు చేయాలని ఓయూ నిర్ణయించింది. ప్రస్తుతానికి ఆన్లైన్ వీడియోల ద్వారా బోధన జరుగుతుందని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.
త్వరలో సెంటర్ ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఏర్పాటు: ఓయూ
జాతీయ, అంతర్జాతీయ విద్యా పోర్టళ్లలోని వీడియో పాఠాల ద్వారా ఆన్లైన్ బోధన జరుగుతోందని పేర్కొంది. ఎక్కవ శాతం సిలబస్ బోధిస్తున్నారని... కొన్ని సార్లు ప్రాజెక్టు రిపోర్టులు, అసైన్మెంట్లకు వాట్సప్, ఈ-మెయిల్ ద్వారా పంపిస్తున్నట్టు తెలిపంది. లాక్డౌన్ ఎత్తివేయగానే సెంటర్ ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీని ప్రారంభించనున్నట్టు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండిః'జూమ్' యాప్ ఎందుకు సురక్షితం కాదంటే...!