రాష్ట్రంలో మినీ పురపోరుకు అంతా సిద్ధమైంది. వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలు, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్, అచ్చంపేట పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు జీహెచ్ఎంసీలోని ఒక డివిజన్, మరో నాలుగు పురపాలికల్లోని నాలుగు వార్డులకు పోలింగ్ జరగనుంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 66 డివిజన్లలో 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగర పరిధిలో 6 లక్షల 53 వేల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఎన్ఐటీలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ.. పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
సిద్దిపేటలో జిల్లా అదనపు కలెక్టర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మాస్కు లేనివారికి పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు. ఆశా వర్కర్‌లు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు శానిటైజర్ చేస్తారని పేర్కొన్నారు. మినీ పోరు కోసం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రంగం సిద్ధమైంది. సిబ్బందికి కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, ఫేస్‌షీల్డ్‌లు పంపిణీ చేయనున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు..