తెలంగాణ

telangana

ETV Bharat / state

రాహుల్​ సభకు భారీ ఏర్పాట్లు - rc kunthiya

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభకు రాష్ట్ర నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ నుంచే ప్రతి ఒక్కరికి కనీస ఆదాయ పథకాన్ని కాంగ్రెస్​ అధినేత ప్రకటిస్తారు. పార్టీ శ్రేణులకు రాహుల్​ దిశానిర్దేశం చేయనున్నారు.

రాహుల్​ సభ ఏర్పాట్ల పరిశీలన

By

Published : Mar 8, 2019, 5:10 AM IST

Updated : Mar 8, 2019, 10:48 AM IST

రాహుల్​ సభ ఏర్పాట్లు షురూ
లోక్​సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్​ పార్టీ శంషాబాద్‌ క్లాసిక్ గార్డెన్స్‌ ప్రాంతంలో నిర్వహించే మొట్టమొదటి సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్​గాంధీ వస్తున్నందున భారీగా కార్యకర్తలు హాజరయ్యేలా స్థానిక నాయకులు కసరత్తు చేస్తున్నారు.

ఏర్పాట్లు పరిశీలన

గురువారం సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏఐసీసీ కిసాన్‌ విభాగం ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి తదితరులు స్థలాన్ని పరిశీలించారు. సమయం తక్కువగా ఉన్నందున ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబానికి కనీస ఆదాయ పథకాన్ని ఇక్కడ నుంచే ప్రారంభిస్తారని కుంతియా వెల్లడించారు.
దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, రైతు సమస్యలపై రాహుల్‌ ప్రత్యేక దృష్టిసారించినట్లు సీనియర్‌ నేత వి.హనుమంతురావు తెలిపారు. విభజన హామీలను అమలు చేసేలా రాహుల్‌ భరోసా ఇస్తారన్నారు.

కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెటు ఎన్నికల్లో ప్రజలు జాతీయ పార్టీలకే పట్టంకడతారని జోస్యం చెప్పారు.

ఇవీ చూడండి:పారదర్శకంగా ఎన్నికలు

Last Updated : Mar 8, 2019, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details