తెలంగాణ

telangana

ETV Bharat / state

పరువు హత్య: హేమంత్​ అంత్యక్రియలకు ఏర్పాట్లు - Gatchibauli hemanth's murder case update

గచ్చిబౌలిలో పరువు హత్యకు గురైన హేమంత్​ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి చందానగర్​లోని నివాసానికి తరలించారు. ఈ మేరకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Arrangements for Hemant's funeral in chandanagar
పరువు హత్య: హేమంత్​ అంత్యక్రియలకు ఏర్పాట్లు

By

Published : Sep 26, 2020, 1:07 PM IST

2 రోజుల క్రితం పరువు హత్యకు గురైన హేమంత్ మృతదేహాన్ని మాదాపూర్​లోని ప్రైవేటు ఆసుపత్రి నుంచి చందానగర్ తీసుకొచ్చారు. మృతుని సోదరుడు అమెరికా నుంచి కొద్ది సేపటి క్రితం రావడంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అంత్యక్రియల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి.

అమెరికా నుంచి వచ్చిన సోదరుడు అన్నయ్య హేమంత్​ మృతదేహంపై పడి గుండెలవిసేలా రోధించడం అక్కడున్న వారిని కలచివేసింది. ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీచూడండి: హేమంత్​ హత్య కేసులో 13 మంది నిందితుల అరెస్టు

ABOUT THE AUTHOR

...view details