గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న తెరాస భారీ బహిరంగ సభకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్బీ స్టేడియం చుట్టు పక్కల రోడ్లన్నీ గులాబీ మయంగా మారిపోయాయి. సభ ఏర్పాట్లను ఇప్పటికే కేటీఆర్ పరిశీలించగా... తెరాస నేత కర్నె ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు.
తెరాస బహిరంగ సభకు సర్వం సిద్ధం - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
బల్దియా ఎన్నికల నేపథ్యంలో తెరాస సాయంత్రం భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున జరగనున్న ఈ సభకు అంతా సిద్ధమైంది. ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
![తెరాస బహిరంగ సభకు సర్వం సిద్ధం arrangements for cm kcr meeting at lb Stadium in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9691880-268-9691880-1606543922671.jpg)
తెరాస బహిరంగ సభకు సర్వం సిద్ధం
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్న ఈ బహిరంగ సభకు దాదాపు 30 నుంచి 40 వేల మంది హాజరుకానున్నారని తెరాస అంచనా వేస్తోంది. స్టేడియంలో 12 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, డివిజన్ ఇంఛార్జీలు తదితరులు పాల్గొననున్నారు. తెరాస నుంచి బరిలో ఉన్న 150మంది ప్రతినిధులు కూడా సభలో పాల్గొంటారు.
Last Updated : Nov 28, 2020, 12:38 PM IST