జాతీయస్థాయిలో సీపీఐ నిర్వహిస్తున్న సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ నలుమూలల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మగ్దుమ్ భవన్ వేదికగా రేపటి నుంచి ఈ నెల 31 వరకు సమావేశాలు జరగనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు.
దేశ రాజకీయాలపైనే ప్రధాన చర్చ: నారాయణ - మగ్దుమ్ భవన్లో సీపీఐ జాతీయ స్థాయి సమావేశాలు
సీపీఐ జాతీయ సమితి సమావేశాలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మగ్దుమ్ భవన్ వేదికగా నిలవనుంది. రేపటి నుంచి ఈ నెల 31 వరకు సమావేశాలు జరగనున్నాయి. జాతీయస్థాయి నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు.
రేపు జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈనెల 30, 31 తేదీల్లో జాతీయ సమితి సమావేశాలు జరగనున్నాయి. ఎర్రజెండాలు, తోరణాలతో సీపీఐ రాష్ర్ట కార్యాలయం ఎరుపు రంగును సంతరించుకుంది. ఈ సదస్సుకు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, అతుల్‌కుమార్ అంజన్, అమర్‌జిత్ కౌర్, రాజేంద్రన్ హాజరుకానున్నారు. సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమావేశాల్లో దేశ రాజకీయాలు, రైతు ఉద్యమంపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.