రాష్ట్రంలో ఈనెల 25 నుంచి నవంబరు 3 వరకు జరగబోయే ఇంటర్మీడియట్(TS Inter exams) పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ప్రకటించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బోర్డు(TS Inter exams) కార్యాలయంలో ఇంటర్ పరీక్షల(TS Inter exams) ఏర్పాట్లపై మీడియా సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. గతేడాది కరోనా కారణంగా పరీక్షల నిర్వహణ జరగలేదని.. ఈ సారి కోర్టు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ తెలిపారు. మొత్తం 4 లక్షల 59 వేల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహమ్మారి దృష్ట్యా ఈసారి పరీక్ష కేంద్రాలు పెంచామని పేర్కొన్నారు. మొత్తం 1,768 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్(TS Inter exams) పరీక్షలు జరుగుతాయని బోర్డు కార్యదర్శి తెలిపారు. ఇప్పటివరకు 82 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని వివరించారు.
ఆదివారమూ పరీక్ష
ఈసారి 70 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహిస్తున్నందున.. ఆ సిలబస్‌కు పరిమితమయ్యే పరీక్ష ఉంటుందని ఉమర్ జలీల్ చెప్పారు. మూడు సెట్ల పరీక్ష పత్రాలను ఎంపిక చేశామని అన్నారు. ఈనెల 31 ఆదివారమైనా పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈ విషయాలు విద్యార్థులు గమనించాలని కోరారు. విద్యార్థులు పరీక్షల సన్నద్ధత కోసం బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ అందుబాటులో ఉందని.. ఇంటర్మీడియట్(TS Inter exams) యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చని తెలిపారు.