Arrangements 77th Independence Day Celebrations At Golconda Fort : హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఇందుకోసం జరుగుతున్న పనులను డీజీపీ అంజనీకుమార్ ఇప్పటికే పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా 500 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండ కోట (Golconda Fort) చుట్టూ 200 సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. ఈ వేడుకల్లో పాల్గొనే వీవీఐపీ, వీఐపీ, అధికారులకు పాస్లు జారీ చేశారు.
77th Independence Day Celebrations At Golconda Fort : ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆగస్టు 15న ఉదయం.. సికింద్రాబాద్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం 11 గంటలకు.. సీఎం గోల్కొండ కోటకు చేరుకొని జాతీయ పతకాన్ని అవిష్కరిస్తారు. ఈ క్రమంలోనే పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఇందులో భాగంగానే కేసీఆర్కు ఘన స్వాగతం పలికేెెెందుకు దాదాపు 1,200 మంది కళాకారులను సంసిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంతో పాటు.. ముందస్తు కవాతు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వావ్.. గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ సెల్ఫీలు చూశారా?.. అంతా AI మహిమ గురూ!
Independence Day Celebrations Telangana 2023 :జాతీయ జెండా అవిష్కరణ అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మరోవైపు స్వాతంత్య్ర వేడుకలకు హాజరయ్యే వారు సభా ప్రాంగణంలో ఎంత దూరంలో ఉన్నా.. కార్యక్రమాన్ని స్పష్టంగా వీక్షించేందుకు 14 పెద్ద ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే గోల్కొండ కోట చుట్టూ ఉదయం 7 గంటల నుంచి.. మధ్యాహ్నం 12 గంటలకు వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ వేడుకలకు వచ్చేవారికోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించారు.