తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్వాతంత్ర్య దినోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి' - telanagana state officers

గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. ఈ మేరకు పలుశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

'స్వాతంత్ర్య దినోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి'

By

Published : Aug 5, 2019, 5:39 PM IST

గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఎస్కే జోషి ఆదేశించారు. ఏర్పాట్లపై పోలీసు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. గతఏడాది తరహాలోనే అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అంతరాయాలు జరగకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాజ్ భవన్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్, గన్ పార్క్, క్లాక్ టవర్ తదితర ముఖ్యప్రాంతాలను విద్యుద్దీపాలతో అలంకరించాలన్నారు. అన్ని సౌకర్యాలు, వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు.

'స్వాతంత్ర్య దినోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి'
ఇదీ చూడండి:'ఆర్టికల్ 370రద్దు'పై రాజ్యసభలో చర్చ ప్రత్యక్షప్రసారం

ABOUT THE AUTHOR

...view details