ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ఆసుపత్రుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. సేవల నిలుపుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్‌వర్క్‌ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ మొదలుకొని... గుండెకు స్టంట్ వరకు నిరుపేదలు అనేక వైద్య సేవలు పొందేవారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు నిలిపివేయడంతో...రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శని, ఆదివారాలు వారాంతం అయినందున ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఇవాళ్టి నుంచి రోగుల సంఖ్య పెరగనుంది. అత్యవసర చికిత్స కోసం చాలామంది వచ్చే వారితో ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగిపోతోంది. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని చూపాల్సిన అవసరం ఉందని రోగులు వాపోతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే సేవలు కొనసాగిస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి.
నాలుగో రోజుకు చేరిన ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల సమ్మె - arogya sri hospitals strike since last four days
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. దీనితో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నాలుగో రోజుకు చేరిన ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల సమ్మె