తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏ క్షణంలోనైనా రంగంలోకి దిగేందుకు ఆర్మీ బలగాలు సిద్ధం - వరదల నేపథ్యంలో అప్రమత్తమైన ఆర్మీ

హైదరాబాద్​లో భారీ వర్షాల నేపథ్యంలో ఆర్మీ బలగాలు సిద్ధంగా ఉన్నట్లు భారత సైన్యం ప్రకటించింది. ఏ క్షణంలోనైనా స్పందించేందుకు తొమ్మిది సహాయక బృందాలు బోట్లతో సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

ఏ క్షణంలోనైనా స్పందించేందుకు ఆర్మీ బలగాలు సన్నద్ధం
ఏ క్షణంలోనైనా స్పందించేందుకు ఆర్మీ బలగాలు సన్నద్ధం

By

Published : Oct 20, 2020, 8:01 PM IST

రానున్న రెండు మూడు రోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆర్మీ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణంలోనైనా స్పందించేందుకు తొమ్మిది సహాయక బృందాలు బోట్లతో సన్నద్ధంగా ఉన్నట్లు భారత సైన్యం వెల్లడించింది. అవసరాన్ని బట్టి మరికొన్ని బృందాలను రంగంలోకి దింపుతామని ప్రకటించింది.

హైదరాబాద్​లో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన బండ్లగూడ ప్రాంతంలో 153 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహరాన్ని అందించినట్లు వివరించింది. ప్రస్తుతం కర్ణాటకలోని బీమ, కృష్ట నదుల వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం 6 వరద సహాయక బృందాలు బోట్లు, వైద్య సామగ్రితో సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపింది. 427 మందిని పునరావాసాలకు తరలించి వారికి ఆహారం పొట్లాలను అందించినట్లు ఆర్మీ వెల్లడించింది.

ఇవీ చూడండి: అధైర్య పడొద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details