రాష్ట్ర భాజపా నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Mla Jeevan Reddy On Bjp) ధ్వజమెత్తారు. భాజపా (Bjp) అంటేనే భారతీయ జనకంటక పార్టీగా మారిందని ఆయన ఆరోపించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (Mla Raghunandan Rao) అబద్దాలు తప్ప ఏదీ మాట్లాడరని ఆక్షేపించారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టిమ్స్ (Tims) ఆసుపత్రిని గచ్చిబౌలి క్రీడా స్థలంలో నెలకొల్పారని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
కరోనాకు ప్రత్యేక ఆసుపత్రి అవసరం లేదని రఘునందన్ అభిప్రాయమా అని ప్రశ్నించారు. క్రీడలు, వైద్యం దేని ప్రాధాన్యత దానికే ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని గణాంకాలు తెలంగాణ ప్రగతిని సూచిస్తున్నాయని... కానీ భాజపా నేతలకు మాత్రం కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. హుజురాబాద్(Huzurabad)లో తెరాస కచ్చితంగా గెలుస్తుందన్నారు. తెరాస ఎవరి ఒత్తిడికి తలవంచదన్నారు.
మొత్తం హుజూరాబాద్ అంతా సారు.. కారు.. పదహారు అంటున్నారు. కాబట్టి హుజూరాబాద్‌లో కూడా మేం పెద్దఎత్తున విజయం సాధించబోతున్నం. ధర్మమే గెలుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రవేశపెట్టిన 120 పథకాలన్నింటిని ప్రజలు చూస్తున్నారు. నాగార్జునసాగర్‌లో ఎలాగైతే విజయం సాధించామో... ఇక్కడ కూడా అలానే మా విజయం ఉండబోతోంది. ఇప్పటికైనా ఈ భారతీయ జనకంటక పార్టీ, బడా జోకర్స్ పార్టీ, బడా జుఠా పార్టీ... మీరు మాట్లాడాల్సింది మా మీదకాదు. కేంద్రంలో ఉన్న మోదీ మీద మాట్లాడండి. మేం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి? మాకు రావల్సిన నిధుల కోసం ఎన్నిసార్లైనా దిల్లీ పోతం. రెండు సార్లు దిల్లీ పోతనే రాష్ట్రమంతా షేక్ అవుతోంది. భాజపా, కాంగ్రెస్ నాయకులంతా ఆగమైతుండ్రు. మా సినిమా చాలా పెద్దగుంటది. రానున్న రోజుల్లో వాళ్లంతా రాష్ట్రాన్ని వదిలి పారిపోతరు.
-- జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే
'మా సినిమా చాలా పెద్దగుంటది... వాళ్లంతా పారిపోవాల్సిందే! ఇదీ చదవండి:bandi sanjay letter to kcr: మంత్రివర్గంలో వారికి అవకాశమివ్వాల్సిందే.. కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ