తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమలేశుడి వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లు విడుదల - lord venkateshwara latest news

తిరుమల శ్రీనివాసుడి వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లను తితిదే విడుదల చేసింది. పలు ఉత్సవాలకు సంబంధించిన ఆర్జిత సేవల టికెట్లను వివిధ తేదీలలో ఆన్​లైన్​ ద్వారా అందుబాటులో ఉంచింది.

virtual arjitha seva tickets news
తిరుమలేశుడి వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లు విడుదల

By

Published : Nov 14, 2020, 2:31 PM IST

తిరుమల వెంకటేశ్వరస్వామి వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లను తితిదే విడుదల చేసింది. శ్రీవారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్​లైన్​లో ఉంచింది. ఒక్కో సేవకు సంబంధించి రోజుకు ఐదు వేల టికెట్లను భక్తులకు అందించనున్నారు.

నవంబరు 15 నుంచి 30వ తేదీ వరకు కల్యాణోత్సవం టికెట్లు, 22 నుంచి 30వ తేదీ వరకు మిగిలిన ఆర్జిత సేవల టికెట్లు అందుబాటులో ఉంచారు. కల్యాణోత్సవం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం ఉచితంగా కల్పించనున్నారు. మిగిలిన సేవలు ఎంచుకున్నవారు అదనంగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. వీరు 90రోజుల్లో అందుబాటులో ఉన్న టైమ్​ స్లాట్స్​ ఆధారంగా దర్శనాలు బుక్ చేసుకునే సౌకర్యాన్ని తితిదే కల్పించింది.

ఇదీ చదవండి:'అందమైన నగరంగా నిజామాబాద్​ని తీర్చిదిద్దుతున్నాం'

ABOUT THE AUTHOR

...view details