ఓ యువతి వినూత్నంగా తన మేధా శక్తికి పదును పెట్టింది. ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేసింది. సికింద్రాబాద్ వారసిగూడ ప్రాంతానికి చెందిన చింతల రమ్య ప్రియ ఆటోమోబైల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అనంతరం దిల్లీలో ఎంబీఏ పట్టా పుచ్చుకుంది. తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 35 నుంచి 40 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చని రమ్య తెలిపారు. తయారీకి సుమారు 20 వేల రూపాయల ఖర్చు అయ్యిందని వెల్లడించారు. గతంలో తాను చదివిన విద్యా సంస్థలో కొందరు పురుషులు మహిళలను కించపరిచేలా మాట్లాడారని.. ఆ మాటలే తన విజయానికి కారణమని బైక్ రూపకర్త చెప్పుకొచ్చారు.
మేమేందులో తక్కువ?? మేము మేధావులమే - 35 TO 40 KMS FOR ONE TIME CHARGING
మహిళలు అంటే చిన్న చూపో లేక స్త్రీలు అంటే చులకన భావమో కానీ రమ్య ప్రియను ఆ మాటలే ఉత్తేజపరిచాయి. ఆమెను కాలుష్య రహిత వాహనాన్ని రూపొందించేందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను అందించాయి. ఫలితంగా అద్భతమైన ఈ బైక్ను రూపొందించి ఔరా అనిపించారు రమ్య ప్రియ.
తయారీకి సుమారు 20 వేల రూపాయలు ఖర్చు అయ్యింది : రూపకర్త
ఇవీ చూడండి : తుదిదశకు చేరుకున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్