తెలంగాణ

telangana

ETV Bharat / state

12 ఏళ్ల తరువాత ఆదిత్యునికి స్వర్ణాభరణాల అలంకరణ - అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం వార్తలు

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి రేపు, ఎల్లుండి బంగారు ఆభరణాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 12 ఏళ్ల తర్వాత ఆదిత్యుడు ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తున్నారు. కార్తిక ఏకాదశి, ద్వాదశి సందర్భంగా రెండు రోజుల పాటు స్వామివారికి ఆపాదమస్తకం స్వర్ణాభరణాలతో అలంకరిస్తామని ఆలయ ఈవో తెలిపారు.

12 ఏళ్ల తరువాత ఆదిత్యునికి స్వర్ణాభరణాల అలంకరణ
12 ఏళ్ల తరువాత ఆదిత్యునికి స్వర్ణాభరణాల అలంకరణ

By

Published : Nov 25, 2020, 12:45 AM IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్‌కు..రేపు, ఎల్లుండి బంగారు ఆభరణాలను అలంకరించనున్నారు. 2008 రథసప్తమి తర్వాత నుంచి ఇప్పటి వరకు సూర్యదేవుడు వెండి నగలతోనే భక్తులకు దర్శనమిస్తున్నారు. 12 ఏళ్లు తర్వాత మళ్లీ ఇప్పుడు వెలుగులరేడు.. సూర్యభగవానుడు ప్రత్యేక అలంకరణతో కార్తిక ఏకాదశి, ద్వాదశి సందర్భంగా రెండు రోజులపాటు స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనభాగ్యం ఇవ్వనున్నారు.

కిరీటం నుంచి పాదాల వరకు అన్ని ఆభరణాలు అలంకరిస్తామని సూర్య దేవాలయం ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. భద్రత ప్రమాణాలు మెరుగు పరుచుకుని దేవాదాయశాఖ అనుమతులతో ప్రతీ ఆదివారం బంగారు ఆభరణాలతో అలంకరిచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

ఇదీ చదవండి : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల... నగరవాసిపై వరాల జల్లు

ABOUT THE AUTHOR

...view details