తెలంగాణ

telangana

ETV Bharat / state

'భాజపా పాలిత ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువ... ఆ మ్యాప్ నకిలీది' - ఆర్మూర్ ఎమ్మెల్యే వార్తలు

రాష్ట్రంలో కరోనా కేసులు పెంచాలని డిమాండ్ చేసేవాళ్లు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్​పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి మండిపడ్డారు. భాజపా నేతలు ముఖ్యమంత్రే కరోనాను తీసుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

aramour-mla-jeevan-reddy-on-bjp-leaders
'భాజపా పాలిత ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువ... ఆ మ్యాప్ నకిలీది'

By

Published : Jun 23, 2020, 2:34 PM IST

కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే... భాజపా నేతలు కొవిడ్‌ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెరాస నేతలు మండిపడ్డారు. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కరోనా వ్యాప్తి పెరగడం సహజమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి పేర్కొన్నారు. ఆస్పత్రుల వద్ద ధర్నాకు దిగిన భాజపా నేతలు... రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని అన్నారని... వారు ఏ విషయంపై పోరాటం చేయాలనుకుంటున్నారో కూడా వారికే తెలియదని వ్యాఖ్యానించారు.

'భాజపా పాలిత ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువ... ఆ మ్యాప్ నకిలీది'

''కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. లాక్​డౌన్ ఎత్తివేశాక, కరోనా టెస్టులు పెంచాక కేసుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది. భాజపా నేతలకు ఈ మాత్రం కూడా తెలియదా..? రాష్ట్రంలో కరోనా కేసులు పెంచాలని నినాదాలు చేస్తున్నారు. దేని మీద పోరాటం చేయాలో కూడా మీకు స్పష్టత లేదు. భాజపా పాలిత ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువగా ఉన్నాయి. సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యే మ్యాప్ నకిలీది.''

-ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి

కలిసి పోరాడాల్సిన సమయంలో రాజకీయాలు చేయడం తగదంటూ ఎమ్మెల్యే హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details