తెలంగాణ

telangana

ETV Bharat / state

కూతురుతో 'గ్రామీ'కి రెహమాన్ - ఏఆర్ రెహమాన్

లాస్ ఏంజెల్స్​లో జరుగుతోన్న గ్రామీ అవార్డు వేడుకకు సంగీత దర్శకుడు రెహమాన్ హాజరయ్యాడు. కూతురుతో పాటు వచ్చి సందడి చేశాడు.

రెహమాన్

By

Published : Feb 11, 2019, 2:08 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమన్ కూతురు రహీమాతో పాటు గ్రామీ అవార్డు వేడుకకు హాజరయ్యాడు. ప్రశాంత్ మిస్త్రీ (లండన్), ఫాల్గుని షా (న్యూయార్క్), సాట్నమ్ కౌర్ (యూఎస్)తో పాటు రెహమాన్ అవార్డు ఫంక్షన్​కు హాజరయ్యాడు.


గ్రామీ 2019 అవార్డులకు హాజరయ్యానని.. కాసే ముస్ గ్రేవ్స్, చైల్డిష్ గాంబినో, క్విన్సీ జోన్స్​తో దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. లేడీ గాగా పర్ఫామెన్స్​ను కూడా అభిమానులతో పంచుకున్నాడు.
కూతురు బుర్ఖా వేసుకోవటంపై వేషధారణలోనూ కుటుంబసభ్యులకు స్వేచ్ఛ లేదా అంటూ సోషల్ మీడియాలో ఇటీవల విపరీతంగా ట్రోల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూతురుతో కలిసి రెహమాన్ గ్రామీ వేడుకలకి రావటం విశేషం.

ABOUT THE AUTHOR

...view details