రాష్ట్రంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలకు రెండేళ్లుగా ఉపకులపతులు లేక విద్యావ్యవస్థ కుంటుపడిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ అన్నారు. ఏబీవీపీ నిరంతర కృషి ఫలితంగానే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని పేర్కొన్నారు.
'ఏపీవీపీ కృషితోనే యూనివర్సిటీలకు నూతన వీసీలు' - ఏబీవీరీ కార్యదర్శి వార్తలు
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీల నియామకంలో ఏబీవీపీ కీలక పాత్ర పోషించిందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జీవన్ తెలిపారు. విశ్వవిద్యాలయాల విద్యావ్యవస్థ పరిస్థితిపై తాము చేసిన పోరాటం ఫలించిందన్నారు.
ఏబీవీపీ కార్యదర్శి
రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు నూతన వీసీల నియామకం కోసం ఏపీవీపీ రెండేళ్లుగా పోరాటం చేస్తోందని తెలిపారు. అసెంబ్లీ ముట్టడి , ప్రగతి భవన్ ముట్టడి, రాస్తారోకో వంటి అనేక నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ నిరంతరం పోరాటం చేస్తుందని వెల్లడించారు.
ఇదీ చూడండి:సైబరాబాద్లో కఠినంగా లాక్డౌన్ అమలు : సీపీ సజ్జనార్