తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ, ఆంధ్రా మధ్య బస్సు సర్వీసుల చర్చలకు బ్రేక్

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు బస్సులు తిప్పితే కేసులు పెరుగుతాయనే సూచనలు ఉన్నాయని ఏపీ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని... ఛార్జీలు పదిరెట్లు పెంచినా ఆర్టీసీకి నష్టాలు తీరవన్నారు.

తెలంగాణకు బస్సు సర్వీసుల పునఃప్రారంభంపై చర్చలకు బ్రేక్: ఏపీ ఆర్టీసీ ఎండీ
తెలంగాణకు బస్సు సర్వీసుల పునఃప్రారంభంపై చర్చలకు బ్రేక్: ఏపీ ఆర్టీసీ ఎండీ

By

Published : Jul 8, 2020, 6:21 PM IST

తెలంగాణకు ఆర్టీసీ సర్వీసుల పునఃప్రారంభంపై చర్చలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడిందని ఏపీ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ అన్నారు. వివిధ అంశాలపై మాట్లాడిన ఆయన... కరోనా పరీక్షల సంఖ్య పెంచేలా 21 ఇంద్ర బస్సులను సంజీవని వాహనాలుగా మార్చామన్నారు. ప్రతి ఇంటికీ కూరగాయలు పంపిణీ చేసేలా బస్సుల్లో సంచార రైతుబజార్లు ఏర్పాటు చేయనున్నామన్నారు.

ఆర్టీసీకి వివిధ బ్యాంకుల్లో రూ.7 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఛార్జీలు పదిరెట్లు పెంచినా ఆర్టీసీకి నష్టాలు తీరవు. సిబ్బంది వేతనాలకు ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు ఇస్తోంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా బస్సులు నడుపుతాం. ఆర్టీసీని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం - ఆర్టీసీ ఎండీ ప్రతాప్

కరోనా సోకి తమ సంస్థలో 80మంది సిబ్బంది చికిత్స పొందుతున్నారని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. కొంత మంది సిబ్బంది చనిపోయారని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు బస్సులు తిప్పితే కేసులు పెరుగుతాయనే సూచనలు వచ్చాయని వెల్లడించారు.

ఇవీచూడండి:పత్తికి 'తెలంగాణ బ్రాండ్‌'!.. మార్కెటింగ్ శాఖ కసరత్తు

ABOUT THE AUTHOR

...view details