తెలంగాణ

telangana

ETV Bharat / state

APSRTC Cargo Service: ఇంటికే ఏపీఎస్​ఆర్టీసీ కొరియర్ సేవలు... వివరాలివే! - APSRTC Courier Services started in ANDHRA PRADESH

తెలంగాణ ఆర్టీసీ బాటలోనే ఏపీఎస్​ఆర్టీసీ ప్రయాణిస్తోంది. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా అక్కడ కార్గో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటి వద్దకు ఏపీఎస్​ఆర్టీసీ కొరియర్ సేవల వివరాలు ఇలా ఉన్నాయి.

APSRTC Courier Services
APSRTC Cargo Service

By

Published : Sep 4, 2021, 10:41 AM IST

ఏపీఎస్ఆర్టీసీ కొత్త హంగులతో దూసుకుపోతుంది. కరోనా వ్యాప్తి సమయంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న ఏపీఎస్​ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ఫోకస్​ పెట్టింది. సంస్థకు వచ్చిన నష్టాలను తగ్గించుకోవడంతోపాటు... ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా కార్గో సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటిసారి ఇలాంటి సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ ప్రారంభించింది. ఇదే మార్గంలో ఏపీఎస్​ఆర్టీసీ కూడా ప్రయాణిస్తోంది.

మరింత ఆదాయం పొందడంలో భాగంగా కార్గో రవాణాను డోర్​ డెలివరీ సదుపాయాన్ని తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబర్ 1 నుంచి ఈ కార్గో రవాణా డోర్​ డెలివరీ సేవలు ప్రారంభమయ్యాయి.

ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ పార్శిళ్లను ఇతర ప్రాంతాలకు పంపించాలన్నా... వచ్చిన వాటిని తీసుకెళ్లాలన్నా... బస్టాండ్‌లోని కొరియర్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై వినియోగదారులు తమ ఇళ్ల వద్దే సేవలు అందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని జిల్లా కేంద్రాలైన శ్రీకాకులం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో ఈ డోర్​ డెలివరీ సౌకర్యం కల్పించారు.

ఇంటికే ఏపీఎస్​ఆర్టీసీ కొరియర్ సేవలు..

  • ఒక కేజీ బరువుకు - 18 రూపాయలు
  • ఒక కేజీ నుంచి 5 కేజీల బరువుకు - 30రూపాయలు
  • ఆరు కేజీల నుంచి 10 కేజీల బరువుకు - 36 రూపాయలు

ప్రారంభదశలో డోర్​ డెలివరీ 10 కిలోమీటర్లు, 10 కేజీల వరకు చేస్తున్నారు.

ఇదీ చూడండి: TSRTC Corgo: వచ్చే నెల నుంచి బెంగళూరులో ఆర్టీసీ కార్గో సేవలు

ABOUT THE AUTHOR

...view details