APPSC Declared Group1 prelims Exam Date: ఆంధ్రప్రదేశ్లో 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ప్రకటించింది. జనవరి 8న గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.
గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఏపీపీఎస్సీ
APPSC Declared Group1 prelims Exam Date: ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ప్రకటించింది. ఆ వివరాలు ఇలా...
ఏపీపీఎస్సీ
మొత్తం 18 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఈనెల 31 నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
ఇవీ చదవండి: